జ్యోతిష భాస్కర గడ్డమణుగు తేజస్విశర్మ గారి నిర్ధేశకత్వంలో…

శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

తేజస్వి ఆస్ట్రో – TEJASWI ASTRO

 

తేజస్వి శర్మ గారి గురించి

జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు ప్రాచీన ఋషులు అందించిన సనాతన మార్గంలో జ్యోతిష పరిష్కారాలు అందించే ప్రముఖ జ్యోతిషులు… శ్రీ గడ్డమణుగు తేజస్వి శర్మ గారు. గ్రహశాంతి కోసం లక్షలకు లక్షలు వెచ్చించాల్సిన అవసరం లేదన్నది తేజస్వి శర్మ గారి అభిప్రాయం. అందుకే పరిహారాల విషయంలో చాలా సులభమైన పరిష్కారలెన్నింటినో ప్రజలకు తెలియజేస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నారు. జ్యోతిష పరిహారాలు మాత్రమే కాదు, సనాతన వైదిక విశేషాలతో కూడిన ప్రవచనాల్లో వారి శైలి మరింత ప్రత్యేకమైనది.

జీవిత విశేషాలు

మర్చి 25 1981 లో గుంటూరులో శ్రీ తేజస్వి శర్మ గారు జంన్మించారు. వారి తల్లి గారు శ్రీమతి సత్యవతి, తండ్రిగారు హర లలితా ప్రసాద్. వారి స్వస్థలం గుడివాడ. చిన్నతనంలోనే కుటుంబ కారణాలవల్ల హర లలితా ప్రసాద్ గారు హైదరాబాద్ కు మకాం మార్చారు. తేజస్వి శర్మ గారి బాల్యం. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే సాగింది. రంగావర్ఝుల వేణుమాధవ శర్మ గారి మంత్రోపదేశంతో తేజస్విశర్మ గారి ఆధ్యాత్మిక యాత్ర ప్రాంరంభమైంది. చిన్నతనం నుంచే సనాతన ధర్మం మీద, హైందవ విజ్ఞానం మీద ఆసక్తి ఉన్న తేజస్వి శర్మ గారు… జ్యోతిషంలో ఎంతో కృషి చేసారు. ఎందరో గురువులను కలుసుకుని, అనేక జ్యోతిష విషయాలు తెలుసుకున్నారు. సంస్కృతంలో ఆయనకున్న పరిజ్ఞానం వల్ల ఎన్నో పురాణాలను, జ్యోతిష గ్రంధాలను అభ్యసించారు. ప్రతి సమస్యకు సులువైన పరిష్కారాలు ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని గ్రహించి, వాటిని ప్రతి ఒక్కరికీ అందించాలనే ఆశయంతో శ్రీ బాలా త్రిపురసుందరి జ్యోతిషాలయాన్ని స్థాపించి, జ్యోతిష సేవలను అందిస్తున్నారు.

శ్రీ గడ్డమణుగు తేజస్విశర్మ గారు

జ్యోతిష సేవలు

ప్రత్యేకించి అమ్మవారి ఉపాసకులైన తేజస్వి శర్మ గారు తేజస్వి ఆస్ట్రో అనే వెబ్ సైట్ ద్వారా ఎన్నో విశేషాలను ప్రజలకు అందిస్తున్నారు. అమ్మవారి వైభవాన్ని ఇంటింటికి చేరవేయాలన్న సంకల్పంతో ఎన్నో పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతే కాదు జీటీవీ, భారత్ టుడే, జయజయ శంకర టీవీ లు ఎన్నో మాధ్యమాల ద్వారా సనాతన ధర్మ ప్రచారం కోసం ప్రవచన యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈటీవీ, భక్తి టీవీ, పూజ టీవీ, సీవీఆర్ ఓం మాధ్యమాల్లో అయన కార్యక్రమాలు ప్రజల విశేష అభిమానాన్ని చూరగొన్నాయి.

జ్యోతిషంలో విశేషమైన సేవలు అందించిన తేజస్వి శర్మ గారికి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం జ్యోతిష భాస్కర బిరుదును ప్రదానం చేసింది. పూరణవైభవాన్ని పూస గుచ్చినట్లు సులభమైన శైలిలో, ఆసక్తి కరంగా, పండిత పామర రంజకంగా ప్రవచన రూపంలో అందిస్తున్న అయనకు కళాక్షేత్ర ఆధ్యాత్మిక సంస్థ… పురాణ రత్నాకర బిరుదును ప్రదానం చేసింది.

బిరుదులు

పురాణ రత్నాకర – కళాక్షేత్ర ఆధ్యాత్మిక సంస్థ
జ్యోతిష భాస్కర – శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం

వ్యక్తిగత వివరాలు

తల్లిదండ్రులు – గడ్డమణుగు సత్యవతి, హరలలితా ప్రసాద్
పుట్టిన తేది – 25 మార్చి, 1981
పుట్టిన స్థలం – గుంటూరు
స్వస్థలం – గుడివాడ
విద్యాభ్యాసం – హైదరాబాద్
ప్రస్తుత నివాసం – హైదరాబాద్
ధర్మపత్ని – గడ్డమణుగు అన్నపూర్ణ

వివిధ మాధ్యమాల్లో గురువు గారి కార్యక్రమాలు

జీ తెలుగు – శ్రీకారం – శుభకరం ( ఫిబ్రవరి 2021 నుంచి కొనసాగుతోంది )
జయజయ శంకర టీవీ – పరిహారాలు ( జులై 2016 – ఆగష్టు 2019 )
భారత్ టుడే – వారఫలాలు ( 2016 లో )
పూజ టీవీ – కుమారి పూజ, దేవి భాగవతం
జీ తెలుగు – అభిషేకం ( మార్చి 2015 – మార్చి 2018 )
సివిఆర్ హెల్త్ – జ్యోతిరారోగ్యం ( జనవరి 2013 – డిసెంబర్ 2014 )
సివిఆర్ ఓం – శ్రీదేవి భాగవతం, గణేశ పురాణం, క్షేత్ర వైభవం, కార్తీక పురాణం ( మార్చి 2013 – ఫిబ్రవరి 2015 )
భక్తి టీవీ – కథాసుధ ( జులై 2012 – డిసెంబర్ 2012 )
ఈటీవీ – శ్రీలలితా అష్టోత్తర శత కథానిక ( జనవరి 2011 – డిసెంబర్ 2011 )