జ్యోతిష భాస్కర గడ్డమణుగు తేజస్విశర్మ గారి నిర్ధేశకత్వంలో…

శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

తేజస్వి ఆస్ట్రో – TEJASWI ASTRO

సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందిస్తూ, విద్య, ధర్మం మరియు సేవ ద్వారా మంచి మార్పు తీసుకురావడం మా ప్రధాన లక్ష్యం. 🤝 మా సేవా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ సమయం, సహాయం లేదా విరాళం ద్వారా సమాజానికి మేలుచేయడంలో మాతో కలవండి. 📞 సంప్రదించండి: 93901 93901

ఈ-వాజ్ఞ్మయం (e-Books)

భారతీయ సనాతన వాజ్ఞ్మయం విశేషమైనది. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఇదే మూలాధారం. అయితే సనాతన వాజ్ఞ్మయంలో చాలా భాగం వివిధ కారణాల వల్ల భవిష్యత్ తరాలకు దూరమౌతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సాహిత్యాన్ని పరిరక్షించి, ఉచితంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చేందుకు శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. మీరూ కూడా ఇతోధికంగా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావచ్చు.

పాఠశాల

ములుగు ప్రాంతంలోని తండాలలో నివసిస్తున్న చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు మా సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తోంది.
విద్యకు దూరంగా ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం మా ముఖ్య లక్ష్యం.
పైచదువులు కొనసాగించాలనుకునే విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం మరియు విద్యా సహాయాన్ని అందిస్తున్నాము.

ఆర్థికంగా బలహీనమైన కానీ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు మరియు ఇతర విద్యా అవసరాల కోసం సహాయం చేస్తున్నాము.
గ్రామీణ మరియు తండా ప్రాంతాల పిల్లలు కూడా మంచి విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మా సంకల్పం.

గోశాల

హైదరాబాద్‌లో కబేళాలకు అక్రమంగా తరలించబడుతున్న గోమాతలను గుర్తించి, వాటిని రక్షించే సేవా కార్యక్రమాన్ని మా గోశాల ద్వారా నిర్వహిస్తున్నాము.
రక్షించిన గోవులకు సురక్షితమైన ఆశ్రయం కల్పించి, ఆహారం, వైద్యం మరియు అవసరమైన సంరక్షణను అందిస్తున్నాము.

మా సేవా కార్యక్రమాల్లో మీరూ భాగస్వాములు కండి

ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణమ్
తటాకోదర సంస్థానాం పరీవాహ ఇవామ్భసామ్
– చాణక్య నీతి

ప్రవాహిస్తూ ఉన్నంత కాలం నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే మన సంపద దానం ద్వారానే గొప్పతనాన్ని సంతరించుకుంటుంది అని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతోంది. ఇదే స్ఫూర్తితో శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిషాలయం 2 దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకించి సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, అన్ని రకాల సమస్యల నుంచి బయట పడాలనే ఉద్దేశంతో శనిహోమాలు, అరుణ పారాయణలు వంటి అనేక హోమ, జప, తపాదులను నిర్వహింపజేస్తోంది. ఈ కార్యక్రమాల్లో మీరు స్వయంగా పాల్గొనవచ్చు, లేదా మీ వివరాలు పంపించి, విరాళాలు చెల్లించడం ద్వారా మీ గోత్ర నామాలతో మీ కుటుంబ సౌభాగ్యం కోసం ఈ సామూహిక హోమాలు నిర్వహించడం జరుగుతుంది.

 

సామాజిక బాధ్యతలో భాగంగా తెలంగాణలోని ములుగు దగ్గరలో గల ఓ తండాలోని పిల్లలకు ప్రాథమిక విద్యను నేర్పించడంతో పాటు, వారిని పైచదువుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ చేపడుతోంది.

ప్రతిభ కలిగి, పైచదువులు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ తన వంతు సహకారం అందిస్తోంది.

హైదరాబాద్ లో గోశాల ద్వారా, కబేళాకు తరలివెళుతున్న గోమాతలకు రక్షణగా వాటి బాధ్యతను సైతం శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ చేపట్టింది.

ఇలాంటి పలు సేవా కార్యక్రమాల్లో శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ కలిసి మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీకు తోచినంత విరాళాన్ని ఫౌండేషన్ కు అందించవచ్చు.