శ్రీరస్తు
శ్రీ మాత్రే నమః
శుభమస్తు

శ్రీ గడ్డమణుగు తేజస్విశర్మ గారు
శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్
అనిర్వేదో సతతం సర్వార్ధేషు ప్రవర్తకః ।
కరోతి సఫలం జన్తోః యత్తత్కరోతి కరోతి సః ।।
(శ్రీమద్రామాయణం – సుందరకాండ)
ఎల్ల వేళలను, అన్ని సందర్భముల్లోనూ ఉత్సాహం కలిగి ఉండడమే శ్రేయస్కరం. అదే మానవుల సర్వ కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
“తేజస్వి ఆస్ట్రో” జ్యోతిష వేదిక మాత్రమే కాదు. సనాతన ధర్మ పరివ్యాప్తి, పరిరక్షణ శిరోధార్యంగా సాగుతున్న ఆధ్యాత్మిక గమనం. అంకితభావం కలిగిన వేద జ్యోతిష పండితుని దిశానిర్దేశకత్వంలో, సనాతన ధర్మంలోని అనేక సూక్ష్మమైన విషయాల పట్ల జ్ఞానాన్ని పంచుతూ, కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దిశానిర్దేశం చేస్తూ, కాలానుగుణంగా ధర్మమార్గం పట్ల జాగృతిని తీసుకురావడమే మా ప్రయత్నం. ఈ మార్గంలో ఎదురయ్యే ఆటుపోట్లను, సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనేందుకు జ్యోతిష మార్గంలో సూచనలు అందించడాన్ని ఓ సేవా మార్గంగా భావిస్తున్నాము.
శ్రీ బాలా త్రిపుర సుందరీ మాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, సంపద సౌభాగ్యాలకై వేదమార్గంలో దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాము.
ముఖ్య కార్యక్రమాలు
రాశి ఫలాలు
తారాబలము
రాశి ఫలాలలో వేటిని చూడాలి
ఈ-వాజ్ఞ్మయం (e-Books)
భారతీయ సనాతన వాజ్ఞ్మయం విశేషమైనది. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఇదే మూలాధారం. అయితే సనాతన వాజ్ఞ్మయంలో చాలా భాగం వివిధ కారణాల వల్ల భవిష్యత్ తరాలకు దూరమౌతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సాహిత్యాన్ని పరిరక్షించి, ఉచితంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చేందుకు శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. మీరూ కూడా ఇతోధికంగా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావచ్చు.
మా సేవా కార్యక్రమాల్లో మీరూ భాగస్వాములు కండి
ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణమ్
తటాకోదర సంస్థానాం పరీవాహ ఇవామ్భసామ్
– చాణక్య నీతి
ప్రవాహిస్తూ ఉన్నంత కాలం నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే మన సంపద దానం ద్వారానే గొప్పతనాన్ని సంతరించుకుంటుంది అని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతోంది. ఇదే స్ఫూర్తితో శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిషాలయం 2 దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకించి సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, అన్ని రకాల సమస్యల నుంచి బయట పడాలనే ఉద్దేశంతో శనిహోమాలు, అరుణ పారాయణలు వంటి అనేక హోమ, జప, తపాదులను నిర్వహింపజేస్తోంది. ఈ కార్యక్రమాల్లో మీరు స్వయంగా పాల్గొనవచ్చు, లేదా మీ వివరాలు పంపించి, విరాళాలు చెల్లించడం ద్వారా మీ గోత్ర నామాలతో మీ కుటుంబ సౌభాగ్యం కోసం ఈ సామూహిక హోమాలు నిర్వహించడం జరుగుతుంది.
సామాజిక బాధ్యతలో భాగంగా తెలంగాణలోని ములుగు దగ్గరలో గల ఓ తండాలోని పిల్లలకు ప్రాథమిక విద్యను నేర్పించడంతో పాటు, వారిని పైచదువుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ చేపడుతోంది.
ప్రతిభ కలిగి, పైచదువులు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ తన వంతు సహకారం అందిస్తోంది.
హైదరాబాద్ లో గోశాల ద్వారా, కబేళాకు తరలివెళుతున్న గోమాతలకు రక్షణగా వాటి బాధ్యతను సైతం శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ చేపట్టింది.
ఇలాంటి పలు సేవా కార్యక్రమాల్లో శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ కలిసి మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీకు తోచినంత విరాళాన్ని ఫౌండేషన్ కు అందించవచ్చు.